తను పుట్టిన గ్రామానికి సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్న కాగ్నిజెంట్ (Cognizant) మేనేజర్, మల్కాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ జోగన్నగారి నర్సింలు కుమారుడైన ప్రవీణ్ గురించి కొంత సమాచారం.
శ్రీమతి జోగన్నగారి వెంకటమ్మ మరియు శ్రీ జోగన్నగారి నర్సింలు గారి ఐదవ సంతానం ప్రవీణ్.
భార్య మయూరి (B.Sc, B.Ed), కుమారుడు నరసింహ మరియు కుమార్తె ధాత్రి.
పాఠశాల విద్య మరియు ఇంటర్మీడియట్ విద్య సంగారెడ్డిలో అభ్యసించారు.
ఉస్మానియా కళాశాల - CBIT, హైదరాబాద్ నుండి 2009 లో బీటెక్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.
16 సంవత్సరాల నుండి సాఫ్ట్వేర్ ఇంజనీరు (Software Engineer) గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కాగ్నిజెంట్ (Cognizant) కంపెనీలో మేనేజర్ గా కొనసాగుతున్నారు.
తన తండ్రి ఆశయాలను కొనసాగించడానికి రాజకీయాల్లో రావాలని 2022లో నిర్ణయం తీసుకున్నారు.
అప్పటి నుండి మల్కాపూర్ గ్రామంలో వివిధ రకాల సేవ కార్యక్రమాలను చేపడుతున్నారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగ్నిజెంట్(Cognizant)
బీటెక్, CBIT చైతన్య భారతి
ఇంటర్మీడియట్ నాగార్జున కళాశాల
4 - 10 వ తరగతి సరస్వతీ శిశుమందిర్
మూడున్నర సంవత్సరాలుగా ప్రవీణ్ చేపట్టిన కొన్ని సేవా కార్యక్రమాలు.
వీధి దీపాల ఏర్పాటు మరియు మరమ్మత్తులు.
మురుగునీటి కాలువల యొక్క మరమ్మత్తులు.
పార్కుల అభివృద్ధికి సహకారం, మొక్కలు నాటడం మరియు వాటి పరిరక్షణకి సహకారం.
రోడ్ల మరమ్మత్తులు.
ఆపదలో ఉన్న వారికి తగిన సహాయం.
మతాలకతీతంగా పండగలకు సంబంధించిన ఉత్సవాలకు తగిన సహాయం మరియు కానుకల పంపిణీ.
అన్ని మతాల ఆధ్యాత్మిక కేంద్రాలలో వివిధ వసతుల కల్పన.
మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహం, ఉన్నత విద్య పై అవగాహన కలిగించుట.
ఉపాధి కల్పనకు కృషి.
ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటుకు అవసరమైన వసతుల కల్పన.
పంచాయితీ కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి తగిన సహాయం. మే డే రోజున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం.
పంచాయితీ, మండల కేంద్రాలలో ఇవ్వబడు వివిధ దృవపత్రాలకు తగిన తోడ్పాటు అందించుట.
గ్రామానికి సంబంధించిన అన్ని రకాల రాజకీయ, సామాజిక, కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనటం.
మల్కాపూర్ గ్రామానికి సంబంధించిన వివిధ రకాల సమస్యలపై మరియు ప్రజల అవసరాలపై లోతైన అధ్యయనం.